అమ్మను నమ్మితే ఆకలి తెలియనివ్వదు.. నేలను నమ్మితే నష్టం రానివ్వదు. అంతేకాదు.. ఏటికేడాది లాభం తెచ్చిపెడుతుంది. భూమి మీద పెట్టిన పెట్టుబడి నేడు కాకపోతే రేపు అయినా రెట్టింపు అవడం తథ్యం. ఈ నిబద్ధతతో ఏర్పాటైనదే ‘గని ఇన్‌ఫ్రా డెవలపర్స్’ సంస్థ. కొనుగోలుదారుల కొనుగోలు శక్తికి అనుకూలంగా ప్లాట్లు డిజైన్ చేసి, అందించడంలో గని ఇన్‌ఫ్రా ముందు ఉంటుంది. గని ఇన్‌ఫ్రా వెంచర్ భూమికి భవిష్యత్తులో ఎలాంటి న్యాయ సంబంధమైన ఇబ్బందులు తలెత్తకుండా క్లియర్ టైటిల్ అందిస్తోంది, నూటికి నూరు శాతం వాస్తును అనుసరించి ప్లాట్లు సిద్ధం చేస్తోంది గని ఇన్‌ఫ్రా సంస్థ.
ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగం మరోసారి ఊపందుకుందనే మాట సర్వత్రా వినపడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గని ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ అద్భుతమైన కొత్త హౌసింగ్ వెంచర్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెంచర్‌లో ప్లాట్లకు విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తోంది. రోడ్లకు రెండు వైపులా పచ్చని చెట్లు పెంచుతోంది. డ్రైనేజి సౌకర్యం కల్పిస్తోంది. వెంచర్ చుట్టూ చక్కని ప్రహారీగోడ నిర్మించి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ప్రతి ప్లాట్‌కు విద్యుత్, మంచినీటి సదుపాయాలను గని ఇన్‌ఫ్రా డెవలపర్స్ సంస్థ కల్పిస్తోంది.

