రైతు స్టార్ మార్చిన స్టార్ కాకర
పొట్టి కాకర అధిక వర్షపాతాన్ని తట్టుకుంటుంది. యాజమాన్య పద్ధతులు సరిగ్గా చేస్తే.. 45 నుంచి 50 రోజుల్లోనే తొలికోత వస్తుంది. పొడవు కాకర కన్నా పొట్టి కాకర నెల రోజులు ఎక్కువ పంట కాలం ఉంటుంది. నిరంతరం నిఘా ఉంచి, జాగ్రత్తగా గమనించి, సస్య రక్షణ చేపడితే లాభదాయక పంట.
ఎదురు లేని వెదురు!
అత్యంత వేగంగా పెరిగే గడ్డి చెట్టు వెదురు. ఆగ్రో ఫారెస్ట్‌లో భాగంగా ప్రభుత్వాలు కూడా అనేక రకాలుగా ఆరోగ్య, ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే వెదురు సాగును ప్రోత్సహిస్తున్నాయి. దీర్ఘకాలం పాటు ఆదాయం ఉండాలనుకునే రైతులు వెదురు సాగు చక్కని ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
నీటిని శుభ్రపరిచే మునగ విత్తనాలు
ముదిరిన మునగ కాయల్లోని గింజలతో చాలా సులువుగా నీటి శుద్ధి సాధ్యం అవుతోంది. తక్కువ ఖర్చుతోనే మురికిని శుద్ధి చేసి, స్వచ్ఛమైన నీరు అందించే మునగ గింజలకు భవిష్యత్తులో మంచి డిమాండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పోషకాల అమ్మ దానిమ్మ
రుచికరంగా ఉండి, ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఔషధ మొక్క దానిమ్మ. దీని పండ్లు మాత్రమే కాకుండా ఆకుల్లోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దానిమ్మ మొక్కలోని ప్రతి భాగం ఔషధంలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతారు.
ఆరోగ్యాల ధార పాలకూర
పాలకూర విత్తనాలు వేసిన రోజు నుంచి 25 రోజులకే పంట చేతికి వస్తుంది. తొలిసారి పంట కోసిన తర్వాత మరో మూడు సార్లు కూడా పాలకూర దిగుబడి వస్తుంది. నేల ఆరోగ్యంగా, బలం ఉన్నదైతే మరో రెండు సార్లు కూడా పంట తీసుకోవచ్చు. తరువాత మరో 15 రోజులకే కటింగ్‌కు వస్తుంది.
కలుపే బంగారం, అణువణువూ ఆదాయం
ఒకే బెడ్ మీద పలు రకాల పంటలు వేయడం ద్వారా నేలను ఏమాత్రం వృథాగా ఉంచకుండా ఆదాయం సంపాదించడమే శ్రీశైలం ఫార్మ్‌లోని ప్రత్యేక ప్రధాన అంశం. ఒక్కో బెడ్ నుంచి నెలకు తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయలు ఆదాయం లభిస్తుంది.
కుప్పం ప్రకృతి పొలంలో అమెరికా విద్యార్థులు
అమెరికా విద్యార్థులు శాంతిపురం మండలం ఎం.కే. పురం, రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి, పెదగనూరు గ్రామాల క్షేత్రాలను పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో వారు ప్రత్యక్షంగా మాట్లాడారు.
బలాన్నిచ్చే ‘శాండ్‌విచ్’ మట్టి!
టెర్రస్‌పైన, కుండీలలో మొక్కలు పెంచేవారికి ఈ శాండ్‌విచ్ మట్టి తయారీ విధానం సులువైనది, మట్టి ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుస్తుంది.
హైడెన్సిటీలో పండ్లు, కూరల సాగు
ఎకరం భూమిలో 500 మొక్కలు నాటడం, అధికదిగుబడి తీయడం ఇజ్రాయెల్ సాంకేతిక విధానం. దీన్నే హైడెన్సిటీ సాగు విధానం లేదా అధిక సాంధ్రత వ్యవసాయం అంటారు. తక్కువ భూమి నుంచి, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీరు అందించి, ఎక్కువ దిగుబడులు సాధించడం ఇజ్రాయెల్ టెక్నాలజీ సాగు పద్ధతి ప్రత్యేకత.
విద్యార్థులకు మట్టి పరీక్షల శిక్షణ
విద్యార్థులు మట్టిని అర్థం చేసుకున్నప్పుడు, వారు జీవితాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారని టీచర్ స్వప్న అన్నారు. సామాజిక భాగస్వామ్యం కల్పించడం ద్వారా విద్యార్థుల్లో నిజమైన మార్పు తీసుకురావడానికి ఈ నమూనా దారి చూపిస్తుంది. గుప్పెడు మట్టి విద్యార్థుల్లో జ్ఞానం పెంచేదిగా మారుస్తుంది.

































