అంజీర పండు లేదా అత్తిపండు ఆహారంగా తీసుకున్నవారికి జీర్ణక్రియ మెరుగు అవుతుంది. అంజీర పండులో పీచుపదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి ఇది సాధ్యం అవుతుంది. ఎముకలు బలంగా మారతాయి. బ్లడ్ పెషర్‌ను తగ్గిస్తుంది. కేలరీలు తక్కువ కనుక బరువును తగ్గిస్తుంది. ఎండిన అంజీర పండును నానబెట్టి ప్రతిరోజూ తింటే రక్తం ఉత్పత్తి పెరిగి, రక్తహీనతను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఆరోగ్యానిక మేలుచేసే సీ, ఈ, ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి కాబటటి మేలు చేస్తుంది. అంజీర పండులో ఎక్కువగా పోషకాలు ఉంటాయి ఉదయం పరగడున రెండు పండ్లు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అంజీర పండ్లు మాత్రమే కాకుండా చెట్టు ఆకులతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు పరిశోధనలలో వెల్లడైంది. ఇవి హైపర్ గ్లైసేమిమా, హైపో గ్లైసేమియా పరిస్థితుల్లో గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకొస్తుందని తేలింది.
వ్యవసాయ క్షేత్రాల్లోనే కాకుండా మిద్దెతోటలో కూడా అంజీర పండ్ల సాగును ఈజీగా చేయొచ్చు. అయితే.. అంజీర మొక్కను నాటిన కేవలం నాలుగు నెలల నుంచే పంట తీసుకోవచ్చు. అందుకు మనం చేయాల్సిన విధానం ఏంటో తెలుసుకుందాం.

