Site icon V.E.R Agro Farms

స్పిన్‌ పద్ధతిలో అధిక దిగుబడి

మూడు ఎకరాలలో యువ రైతు అరవింద్ ఆర్గానిక్‌ కార్బన్‌ ఫార్మింగ్‌ విధానంలోని స్పిన్‌ పద్ధతిలో పలు రకాల పంటలు పండిస్తున్నారు. స్పిన్‌ పద్ధతిలో బేకింగ్‌ సోడా ఉపయోగించి ఇంగ్లీష్ కుకుంబర్‌ సాగుచేస్తున్నారు. పొలంలో ఇంకా వాటర్‌మిలన్‌, టామోటా, వంగ, జామ, వేరుశనగ, చిక్కుడు, పచ్చిమిర్చి పంటలు పండిస్తున్నారు. స్పిన్‌ విధానంలో సాగు చేస్తున్న సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన రైతు అరవింద్‌ అనుభవాలు తెలుసుకుందాం.

రైతుకు దిగుబడి చాలా ముఖ్యం అన్నారు అరవింద్‌. అడ్వాన్స్‌ గ్రోత్‌ ప్రమోటర్‌ వాడిన తర్వాత తమ పొలంలో రిజల్ట్‌ బాగా కనిపించిందని చెప్పారు. గ్రోత్‌ ప్రమోటర్ కారణంగా ఒక్కో కుకుంబర్ పాదు నుంచి 4 నుంచి 5 కిలోల దిగుబడి వచ్చిందన్నారు. తనకు దిగుబడి ఎక్కువ రావడమే కాకుండా రుచి బాగుందని కస్టమర్లు చెప్పారన్నారు. నిజానికి వేసవి కాలంలో కుకుంబర్ సాగు సాధ్యం కాదు. కానీ తమ కుకుంబర్‌కు వచ్చిన డిమాండ్‌ వల్ల ఛాలెంజింగ్‌గా తీసుకుని సాగుచేస్తున్నట్లు చెప్పారు. ఓసీఎఫ్‌ రూపొందించిన రూపినేని కాంతి నుంచి ప్రతి రోజూ గంట సమయం తమకు క్లాసులు ఉంటాయన్నారు. ఆ సమయంలో సాగులో ఎలాంటి సమస్య వచ్చినా ఏమేమి చేయాలి? ఎలా సమస్యను అధిగమించాలో వివరంగా చెబుతారని తెలిపారు.రెండుసార్లు కుకుంబర్‌ పంట 280 కిలోల దిగుబడి తీసినట్లు అరవింద్ చెప్పారు. ఇంగ్లీష్‌ కుకుంబర్‌ను హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో రూ.50 చొప్పున అమ్ముతున్నట్లు తెలిపారు. తాము పండించిన కుకుంబర్‌లో పోషకాలు ఉండడంతో వినియోగదారులు సంతృప్తి చెందుతున్నారని అన్నారు. మొక్కలకు తాము వినియోగించే గ్రోత్ ప్రమోటర్‌, కిషన్‌చంద్‌ OWDC, వ్యామ్‌ ద్వారా పోషకాలు పుష్కలంగా ఉంటున్నాయని చెప్పారు. వీటిని వాడడం వల్ల మొక్కలు వేర్లను బాగా అభివృద్ధి చేసుకుంటున్నాయని అన్నారు. తద్వారా తమకు దిగుబడి బాగా వస్తోందని తెలిపారు. స్పిన్‌ విధానంలో సాగు చేస్తే.. మొక్కలు బాగా ఉంటాయని, దిగుబడి బాగుంటుందని, రుచి, క్వాలిటీ కూడా బాగుంటుందని చెప్పారు.స్పిన్ పద్ధతిని, బేకింగ్ సోడాను వినియోగించక ముందు తమ పొలంలో మొక్కల ఎదుగుదల అంత బాగా ఉండేది కాదన్నారు అరవింద్‌. గతంలో రసాయన ఎరువులు వేస్తేనే మొక్కలు ఎదిగేవని అన్నారు. చాలా మంది రసాయన ఎరువులు వేయమని సలహా ఇస్తుంటారన్నారు. అయితే.. తాను గ్రోత్ ప్రమోటర్‌, OWDC, వ్యామ్‌, ముఖ్యంగా పెస్ట్‌ కంట్రోల్‌ మాత్రమే చేస్తానన్నారు. పెస్ట్‌ మేనేజ్‌మెంట్ కోసం తాను వైట్ వెనిగర్‌, బేకింగ్ సోడా, బవేరియా ఎకో ఫంగస్‌, సోలార్ ట్రాప్స్‌, స్టిక్‌ ప్యాడ్స్‌ వాడతామన్నారు. సోలార్‌ ట్రాప్స్‌ పురుగులను ఎంత బాగా ఆకర్షిస్తాయో ఊహించలేం అని చెప్పారు. పగటి పూట క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తాం. ఆ సమయంలో క్రిమి కీటకాలు భూమి లోపల ఉంటాయి. రాత్రిపూట యధేచ్ఛగా మొక్కలపై దాడి చేస్తాయన్నారు. ఎలాంటి మందులు కొట్టినా కంట్రోల్‌ కాని పురుగులు సోలార్‌ ట్రాప్స్ అయితే 99 శాతం నియంత్రిస్తాయని తెలిపారు. ఓసీఎఫ్‌, OWDC, వ్యామ్‌, వైట్‌ వెనిగర్‌, బేకింగ్‌ సోడా వాడడం వల్ల తమ కుకుంబర్ మొక్కలకు ఒక్క పెస్ట్‌ కూడా లేదన్నారు.రసాయనాలు వాడినప్పటికీ, స్పిన్‌ విధానంలో సాగు చేసినప్పటికీ నేలలో చాలా మార్పు వచ్చిందని అరవింద్ చెప్పారు. రసాయనాలతో సాగు చేసినప్పుడు భూమి గట్టిగా ఉండేదని స్పిన్‌ విధానం అమలు చేశాక నేల కుషన్‌లా గుల్లగా మారిందన్నారు. వేర్లకు గుడ్ బ్యాక్టీరియాలు చాలా ఎక్కువగా వచ్చాయన్నారు. మొక్కలకు కేవలం రూ.350 ఖరీదైన చిన్న ప్యాకెట్‌లో గ్రోత్‌ ప్రమోటర్‌ను డ్రిప్‌ ద్వారా, స్ప్రే ద్వారా అందించామన్నారు. ఒక ప్యాకెట్‌ ఎకరం పొలంలోని మొక్కలకు సరిపోతుంది. రసాయన ఎరువులకైతే రవాణా ఖర్చులు కూడా చాలా ఎక్కువే ఉంటాయి. గ్రోత్ ప్రమోటర్‌ చిన్న ప్యాకెట్ కాబట్టి చేత్తో తెచ్చుకోవచ్చన్నారు. గ్రోత్‌ ప్రమోటర్‌ను లీటర్‌ నీటిలో కేవలం 2 గ్రాములు వేసి కలిపి, మొక్కలకు సంవత్సరానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మొక్కలకు నెలకు ఒక ఒకసారి కిలో బెల్లం ఇస్తామమని చెప్పారు. దాంతో పాటు OWDC, వ్యామ్‌ ఒకసారి కొట్టుకుంటే మూడేళ్ల వరకు సరిపోతుంది.పొలంలో అంతకు ముందు టమోటా సాగు కోసం యూరియా ఎక్కువగా వాడాల్సి వచ్చేదన్నారు. అందుకు ఖర్చు ఎక్కువ వచ్చేదని చెప్పారు. గ్రోత్‌ ప్రమోటర్ వల్ల ఒక్కో టమోటా మొక్క నుంచి పంట కాలం మొత్తంలో 5 కిలోల దిగుబడి వచ్చినట్లు చెప్పారు. గ్రోత్‌ ప్రమోటర్ వల్ల టమోటా మొక్క సుమారు 4 అడుగుల ఎత్తు పెరిగిందని అరవింద్ చెప్పారు. మొక్కలు బాగా పెరిగి ఒరిగిపోవడంతో స్తంభాలకు కట్టాల్సి వచ్చింది. అలాగే ఒక్క పువ్వు కూడా రాలిపోలేదు. టమోటా టమోటా పండ్లను గుత్తులు గుత్తులుగా తెంపుకున్నట్లు చెప్పారు. రసాయనాలు, పెస్టిసైడ్స్‌ లేకుండా వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే ఓసీఎఫ్‌ ఫార్మింగ్‌ ముఖ్య ఉద్దేశమని అరవింద్ తెలిపారు.

Exit mobile version