Site icon V.E.R Agro Farms

­­అన్నంతో అధికంగా మల్లెపూలు

మల్లెపూలను మనం సువాసన కోసమే వాడతాం కదా. కానీ వీటిలో ఆరోగ్య, సౌందర్య, మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మల్లెపూలలోని సువాస ఒత్తి­డి, ఆందోళనను తగ్గిస్తాయి. చక్కని నిద్ర కలగజేస్తాయి. చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి మల్లెపూల టీ తాగితే కాలేయ ఆరోగం బాగవుతుంది. ఆయుర్వేదంలో మల్లెపూలను దివ్య ఔషధంగా వినియోగిస్తారు. మల్లెపూల రసం ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతం అవుతుంది. మల్లెపూలను మెత్తగా నూరి తడిబట్టలో చుట్టి కళ్లపై పెట్టుకుంటే కళ్ల మంటలు, నీరు కారడం ఆగిపోతాయి. మల్లెపూలు శరీరంలోని హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.

మల్లెమొక్కలు కొత్తగా కొనేవారు కాండం బలంగా, ఎక్కువ కొమ్మలు ఉండి, పువ్వులు పూసిన వాటినే ఎంపిక చేసుకోవాలి. మొక్కలను తీసుకొచ్చిన వెంటనే రీపాటింగ్ చేయకుండా.. మన దగ్గర వాతావరణాన్ని దానికి అలవాటు చేయాలి. మల్లె మొక్కలు బాగా ఎదిగి, పూలు ఎక్కువగా రావాలంటే ఇలాంటి ఎరువు తయారుచేసి వేస్తే సరిపోతుంది. అన్నం రాత్రి తినగా మిగిలింది కానీ, కాస్త మెత్తబడినదైనా గుప్పెడు తీసుకోవాలి. దాంతో పాటు మూడు రోజులు పులియబెట్టిన మజ్జిగ తీసుకోవాలి. దీంట్లో మొక్కలకు మేలు చేసే గుడ్‌ బ్యాక్టీరియా ఉంటుంది. పుల్లని మజ్జి మొక్కల మట్టిలో వేస్తే.. దాంట్లోని గుడ్ బ్యాక్టీరియా మరింత ఎక్కువగా పెరుగుతుంది. మూడోది పౌడర్‌గా ఉన్న బెల్లం తీసుకోవాలి. ఈ మూడు పదార్థాలను కలిపి ఫర్మాంట్‌ చేసి మొక్కలకు ఇస్తే.. ఎండాకలం సీజన్‌లోనే కాకుండా ఇతర కాలాల్లో కూడా మల్లెపూలు పూస్తాయి.అన్నంను చేత్తోనే మెత్తగా నలపాలి. మిక్సీలో మాత్రం వేయొద్దు.  కొంచెం పెద్ద సైజు కంటెయినర్‌లో మెత్తగా నలిపిన అన్నం వేయాలి. దానికి ఒక టీ స్పూన్ బెల్లం యాడ్‌ చేయాలి. వాటికి అర లీటర్‌ పులిసిన మజ్జిగ కలపాలి. ఈ మూడింటిని మూడు రోజులు ఫర్మాంట్‌ చేయాలి. ఈ మూడు రోజులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం టీ స్పూన్‌తో కాని, మరేదైనా వస్తువు తీసుకొని బాగా కలపాలి. మూడు రోజులకు కంటెయినర్‌లోని అన్నం మొత్తం పిండిలా మారిపోయి, మజ్జిగ ద్రావణంలో బాగా కలిసిపోతుంది. మూడు రోజులు పులియబెట్టినా దీన్నుంచి ఎలాంటి బ్యాడ్‌ స్మెల్‌ రాదు. మంచి వాసనే వస్తుంది. ఈ మూడింటి మిశ్రమ ద్రావణాన్ని టీ జాల్‌తో వడకట్టాలి. జాల్‌లో మిగిలిన అన్నం ముక్కలను మళ్లీ కంటెయినర్‌లో వేసి, నీళ్లుపోసి ఒక రోజు పులియబెట్టి మళ్లీ మొక్కలకు ఇవ్వొచ్చు. అన్నం, బెల్లం, మజ్జిగలోని పోషకాలు నీటిలోకి చేరిపోయి, మొక్కల కుండీలో వేస్తే.. అవి చాలా బలంగా ఎదుగుతాయి.అన్నం, బెల్లం, మజ్జిగతో తయారు చేసిన ఒక మగ్గు ద్రావణానికి ఐదు మగ్గుల నీరు కలిపి డైల్యూట్‌ చేయాలి. ఈ ద్రావణాన్ని మొక్కలపై స్ప్రే చేసినప్పుడు కాస్త చిక్కగా ఉన్నా పరవాలేదు. కానీ మొక్కల మొదట్లో మట్టిలో వేసేటపుడు తప్పకుండా నీటితో పలచగా చేయాలి. ఈ ద్రావణాన్ని ఎండాకాలంలో మాత్రం సాయంత్రం వేళ వేస్తేనే మంచిది. ద్రావణం ఇచ్చే ముందు కుండీలోని మట్టిని లూజ్‌గా చేయడం వల్ల ద్రావణంలోని పోషకాలను వేరు త్వరగా తీసుకుంటుంది.వేసవి కాలం వచ్చిందంటే మల్లెపూల సీజన్‌ మొదలవుతుంది. మల్లెమొక్కలకు ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రూనింగ్‌ చేస్తే.. ఎక్కువ పూలు పూస్తాయి. మొక్క వయస్సు, సైజును బట్టి ప్రూనింగ్ చేయాల్సి ఉంటుంది. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడైతే మొక్కల చివర ఉన్న చిగురును కత్తిరించి, దాని ఆకులన్నీ తొలగించి, ఎరువు వేసుకోవాల్సి  ఉంటుంది. మల్లెమొక్కలను కుండీల్లో, టబ్‌లలో లేదా కంటెయినర్లలో పెంచే వారు నాటి రెండు మూడేళ్లు అయితే.. వేళ్లు కూడా ప్రూనింగ్‌ తప్పకుండా చేసుకోవాలి.  ప్రూనింగ్ చేస్తే.. వేర్లు బాగా అభివృద్ధి చెంది, మొక్కలు బాగా బలంగా తయారవుతాయి. తద్వారా మల్లెపూల దిగుబడి ఎక్కువ ఇచ్చేందుకు తోడ్పడతాయి. అదే నేలలో పెంచేవైతే.. వాటి వేర్లు వాటికవే విస్తరిస్తాయి. కంటెయినర్లలో మొక్కలు వేర్లు ఎక్కువ అయిపోయి, మనం అందించే ఎరువులను పూర్తిగా తీసుకోలేక, బయటికి వదిలేస్తాయి. వేర్లు ఎక్కువైతే మొక్క ఎదగదు, పూలు అస్సలు రావు. అందుకే వేర్లను కూడా ప్రూనింగ్ చేయాలనేది.మల్లె మొక్కలకు మరిన్ని పోషకాల గురించి తెలుసుకుందాం. ఒక గ్రాము పటిక పౌడర్‌ మల్లెమొక్క మొదట్లో ప్రతి 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి. మొక్కల మొదట్లోని మట్టిని కదలించి, పటిక పౌడర్‌ కుండీ చివరిలో వేయాలి. పటిక కారణంగా మట్టి ఎసిడిక్‌గా తయారవుతుంది. పీహెచ్‌ స్థాయిలను బ్యాలెన్స్‌  చేస్తుంది. దీంతో మల్లెపూలు బాగా పూస్తాయి. మల్లెమొక్కలకు రెండు రోజులకు ఒకసారి మాత్రమే సరిపడినంత నీరు అందించాలి. నీరు అధికంగా ఇస్తే.. ఆకులు ఎక్కువై, మల్లె పూతలు తగ్గిపోతాయి. మొక్క మొదట్లో ఎలాంటి ఎరువు వేయకూడదు. మల్లె మొక్క మొదట్లో ఉండే కలుపును ఎప్పటికప్పుడు తీసేయాలి. లేకపోతే మనం వేసిన ఎరువును కలుపుమొక్కలు తీసుకుని మల్లెమొక్కకు అందకుండా చేస్తాయి.మల్లె మొక్కకు ఎండ చాలా అవసరం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నీడలో పెట్టకూడదు. నీడలో పెట్టిన మొక్కలకు ఎన్ని ఎరువులు ఇచ్చినా మొక్క బాగా ఎదుగుతుంది కానీ పూలు మాత్రం పూయవు. మల్లె మొక్కకు కాల్షియం కూడా అవసరమే. అందుకే దానికి పటిక పౌడర్ వేసిన 15 రోజులకు ఎక్కువగా కాల్షియం లభించే ఎక్సెల్‌ పౌడర్‌ గానీ, చాక్‌పీస్ పౌడర్‌ గానీ వేసుకోవాలి. లేదా పాన్‌లో వాడే సున్నం కూడా మొక్కలు ఉన్న కుండీలో వేయొచ్చు. ఫెర్టిలైజర్ షాపుల్లో దొరికే బోన్‌మీల్‌ అయినా వాడవచ్చు. కాల్షియం లోపం ఉంటే మల్లె మొక్క నుంచి మొగ్గలు రాలిపోతాయి. పూలు కూడా సరిగా విచ్చుకోవు. ఆకులు కూడా మెలికలు తిరిగినట్లు వస్తాయి. వీటన్నింటినీ నివారించేందుకు ఎక్సెల్‌ పౌడర్‌ ఉపయోగపడుతుంది.రిచ్‌ ఎన్‌పీకే ఉండే ఫెర్టిలైజర్‌ మల్లె మొక్కలకు అవసరం. అరటిపండు తొక్కల్లో, బంగాళాదుంప తొక్కల్లో ఎన్‌పీకే చాలా ఎక్కువ ఉంటుంది. వాటిని బాగా ఎండబెట్టి, పౌడర్‌ చేసి, మొక్కకు అందించవచ్చు. అరటిపండ్లు, బెల్లం కలిపి రెండు మూడు రోజులు మురగబెట్టి ఎరువు తయారు చేసి స్ప్రే చేయొచ్చు, మొక్క మొదట్లో వేసుకోవచ్చు.మల్లెమొక్కలు నేలపై పెంచితే పరవాలేదు. కుండీల్లో పెంచితే తప్పకుండా వాటిని రీపాటింగ్ చేయాలి. కుండీలో మట్టిలోని బలాన్ని మొక్క మొత్తం తీసేసుకుంటుంది. కాబట్టి దానిలో బలం ఉండదు. పాతమట్టి తీసేసి, పోషకాలతో కూడిన తేలికపాటి కొత్త మట్టితో కుండీ నింపాలి. ఈ మట్టిలో నీరు అస్సలు నిలబడకూడదు. రీపాటింగ్ తర్వాత పెద్ద పెద్ద ఆకులు, ఎండిన కొమ్మలను తీసేయాలి. ఇలా చేస్తే.. కొత్తగా వచ్చే మల్లె మొగ్గలకు బలం ఇచ్చినట్లు అవుతుంది.

Exit mobile version