భూమాతను నమ్ముకున్న కృషీవలుడాయన. నేలతల్లిని నమ్మినవాడికి నష్టం అనే మాటే ఉండదని ఆయన నిశ్చల విశ్వాసం. ఇది వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ సంస్థ ఏర్పాటుకు మూలపురుషుడు వర్రే ఈశ్వరరావుగారి జీవన సిద్ధాంతం. భూమాతతో అనుబంధం పెంచుకుని జీవితపు చివరి అంచులదాకా అపరిమితానందాన్ని అనుభవించిన వ్యక్తి వర్రే ఈశ్వరరావుగారు. మట్టితో మమేకమయ్యారాయన. వర్రే ఈశ్వరరావుగారి స్ఫూర్తే వీఈఆర్ ఆగ్రోఫార్మ్ ఏర్పాటుకు, వీఈఆర్ ఆగ్రోఫార్మ్స్ వెబ్‌సైట్ ఆవిర్భావానికి, నిర్వహణకు మూలం.అలాంటి వర్రే ఈశ్వరరావుగారు శివైక్యం చెంది ఏడు వసంతాలు అయింది. వర్రే ఈశ్వరరావుగారి 7వ వర్ధంతిని ఆయన సతీమణి, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం మామిడికోళ్ల సర్పంచ్ విజయలక్ష్మిగారు, తనయుడు వర్రే గంగాధర్ (తిలక్) ఇతర కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. గుడ్లవల్లేరు లయన్స్ సేవా భవనంలో జరిగిన వర్రే ఈశ్వరరావుగారి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా 50 మంది నిరుపేద వృద్ధులకు అన్న సంతర్పణ చేశారు. అలాగే వారికి గొడుగులు పంపిణీ చేశారు.వర్రే ఈశ్వరరావుగారి వర్ధంతి కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ సభ్యులు శశికళ, పెరుమాళ్లు, వైపీసీ ప్రసాద్, మోహనరావు, పరంధామయ్య, వెంకట్‌రావు, వీ.సుబ్బారావు, నాగేశ్వరరావు, విజయ్, రవీంద్ర, అల్లూరి రామశాస్త్రులు, అల్లూరి బుజ్జిబాబు, అల్లూరి తాతయ్య, అల్లూరి రమేష్, తోట రాధిక, కమ్మిలి ఫణీంద్ర, పాల్గొన్నారు. ఈశ్వరరావుగారి కుటుంబ సభ్యులు అందరూ ఈ అన్నదానం, గొడుగుల పంపిణీ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.ముందుగా లయన్స్‌క్లబ్ సేవా భవనంలో వర్రే కుటుంబ సభ్యులు, అతిథులు ఈశ్వరరావుగారి చిత్రపటానికి పూలమాల వేశారు. ఆయనకు పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. ఈశ్వరరావుగారి సేవలను అందరూ గుర్తుచేసుకున్నారు. ఈశ్వరరావుగారి ఆత్మకు శాంతి చేకూరాలని వృద్ధులు మనస్ఫూర్తిగా కోరుకున్నారు.