సాధారణంగా రైతన్నలు ఎలా ఆలోచిస్తారు? పంట సాగులో ఎంత ఎక్కువ ఎరువులు వేస్తే అంత దిగుబడి పెరుగుతుందని కదా? కానీ నీమ్‌జాప్, గ్రోత్ ఫిట్ ఆకుల కషాయం వాడిన మిర్చి మొక్కల్లో ఎదుగుదల, ఆరోగ్యం, అంతకు మించి దిగుబడి వస్తుందని ఎంతమందికి తెలుసు? ప్రకాశంజిల్లా పొదిలి రైతు మహేశ్వర్‌రెడ్డి నీమ్‌జాప్, గ్రోత్ ఫిట్ వాడిన కారణంగా ఒక్క చెంచాడు రసాయన ఎరువు కూడా తాను వేయలేదని తెలిపారు. ఎరువులు వాడిన మిర్చి తోట కన్నా నీమ్‌జాప్, గ్రోత్ ఫిట్ వాడిన మొక్కలే మంచి ఎత్తు ఎదిగాయన్నారు. మిరపమొక్కల ఆకులకు ముడత రాలేదని, ఆరోగ్యంగా, పచ్చగా ఎదిగాయి. సేంద్రీయ ఎరువులు వాడిన మొక్కలు 45 రోజుల్లో ఎదిగినంత ఎత్తుకు రసాయనాలు వాడిన మొక్కలు ఎదగాలంటే కనీసం 90 నుంచి 110 రోజులు పడుతుందని తెలిపారు.నీమ్‌జాప్, గ్రోత్ ఫిట్ వాడిన తమ పొలంలో వారం రోజుల్లోనే మిరప మొక్కల జానెడు ఎత్తు పెరిగాయి. ఆకులు చక్కగా తయారయ్యాయి. మొదళ్లు దృఢంగా వచ్చాయి. పూత కూడా ఎంతో బాగా ఉందని వెంకటేశ్వరరెడ్డి వివరించారు. ఈ మాదిరిగా మిర్చి తోట పెరగాలంటే రెండు ఎకరాలకు సుమారు 20 బస్తాల రసాయన ఎరువులు వేయాల్సి ఉంటుందన్నారు. నెమ్‌జాప్, గ్రోత్ ఫిట్‌ను 12 లీటర్లు వాడితే సుమారు రూ.8,200 ఖర్చు మాత్రమే అయిందన్నారు. అదే రసాయన ఎరువులు వాడితే ఖర్చు ఎంత ఎక్కువ అవుతుందో ఎవరికి వారే అంచనా వేసుకోవచ్చన్నారు. అంతకు ముందు మిర్చి పంటకు పట్టే పురుగుల నివారణ కోసం ఒక్కో ఎకరాకు ఒక్కోసారి పురుగు మందు స్ప్రే చేసేందుకు కనీసం రూ.3 వేలు అయిందన్నారు. సేంద్రీయ ఎరువులు వాడిన తమ పొలంలో పురుగుల బెడద లేదన్నారు.మిర్చి సాగులో తాను ఎకరానికి 20 నుంచి 40 బస్తాల వరకు ఎరువులు వేసేవాడినని జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ రైతు దేవేందర్‌రెడ్డి తెలిపారు. తొలిసారి కాస్త దిగుబడి ఎక్కువ వచ్చినా, తర్వాత తర్వాత మొక్కలు క్షీణించాయని, కాయ సైజు తగ్గిందని చెప్పారు. తక్కువ మొత్తంలోనే నీమ్‌జాప్, గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత మొక్కలకు పురుగు పట్టలేదని, ఆకులు ఆరోగ్యంగా ఉన్నాయని, తద్వారా మిరప కాయలు మంచి సైజులో వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఎరువుల పరిమాణం సగానికి పైగా తగ్గించినా గతం కంటే ఇప్పుడే పంట బాగుందన్నారు. నీమ్‌జాప్, గ్రోత్ ఫిట్ వాడిన తర్వాత మొక్కల్లో 20 రోజుల వరకు ఎలాంటి గ్రోత్ కనిపించలేదని చెప్పారు. 20 రోజుల తర్వాత మెల్ల మెల్లగా మొక్కల ఎదుగుదల మొదలైందన్నారు. సాధారణంగా తాను వాడే ఎరువు కంటే 30 బస్తాలు తగ్గించినా సేంద్రీయ ఎరువుల కారణంగా మిర్చి దిగుబడి తొలి కాపులో 20 నుంచి 25 బస్తాలు వచ్చిందని, తర్వాతి కటింగ్‌లో 15 నుంచి 20 బస్తాల వరకు వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం ఎర్రక చెరువు రైతులు ఎక్కువగా మిరపసాగు చేస్తారు. మొక్కలకు పట్టే తెగుళ్ల నివారణకు పెద్ద ఎత్తున పురుగు మందులు పిచికారీ చేసేవారు. గ్రోత్ ఫిట్ కషాయం వాడిన తర్వాత తెగుళ్లు తగ్గిపోయాయని వారు తెలిపారు. నాటిన 10 రోజుల లోపే మిర్చి ఆకులు ముడుచుకుపోయి, మొక్కలు చనిపోతుంటే ఎకరాకు 3 లీటర్ల నీమ్‌జాప్‌ను మొక్కల మొదళ్లలో పోసినట్లు యువరైతు జయన్న చెప్పారు. నీమ్‌జాప్ వేసిన తర్వాత ఐదు రోజుల వరకు తోటకు తడి పెట్టలేదన్నారు. అప్పటి నుంచి మొక్కలు చనిపోలేదని, వేరుకుళ్లు, నెటోడ్స్ లాంటివి రాలేదన్నారు. తర్వాత మరోసారి గ్రోత్ ఫిట్ స్ప్రే చేసినట్లు చెప్పారు. గ్రోత్ ఫిట్ ఆకుల కషాయంతో సహజసిద్ధంగా తయారు చేసేది కాబట్టి మందు కలిపినప్పుడు ప్రమాదం ఏమీ ఉండదు. రసాయన మందుల మాదిరిగా చేతులు మంటలు కూడా పుట్టవు.ఆర్గానిక్ విధానంలో పంటలు సరిగా పండవనే భావన రైతుల్లో ఉండేదని, అది కేవలం అపోహ అని ఇప్పుడు తేలిపోయిందని మరో రైతు తిమ్మప్పగౌడ్ వెల్లడించారు. నీమ్‌జాప్, గ్రోత్ ఫిట్ వాడితే ఇంత చక్కగా మొక్కలు ఎదుగుతాయని తాము అస్సలు ఊహించలేదన్నారు. గుత్తులు గుత్తులుగా ఎర్రమిర్చి పంట వస్తే.. ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.సహజసిద్ధంగా తయారు చేసే ఎరువులు, పురుగు మందులు వాడితే సాగు ఖర్చులకు టాటా చెప్పొచ్చు. నాణ్యమైన అధిక దిగుబడి కూడా వస్తుంది. తద్వారా రైతుకు ఎక్కువ ఆదాయం, కుటుంబంలో సంతోషం వస్తాయని రైతులు తమ అనుభవాలతో తెలిపారు.