వేసవి కాలం వచ్చేసింది. ఫిబ్రవరి ఆఖరి వారం నుంచే ఎండలు ముదురుతున్నాయి. ఏసీలు లేని వారి శరీర వేడి తగ్గించి, చల్లదనం అందించడంలో వట్టివేరు గట్టిదనే చెప్పాలి. మంచి సువాసన ఉండే వట్టివేర్లను ఆరోమా థెరపీ, చర్మ సంరక్షణ, ఒత్తిడి నివారణ కోసం వాడతారు. వట్టివేర్లు నీటిలో నానబెట్టి, ఆ నీరు తాగితే.. కడుపునొప్పి, మలబద్ధం, మూత్ర సంబంధ సమస్యలు దూరం అవుతాయి. వట్టివేర్లు మంచి సువాసన కలిగి ఉంటాయి కాబట్టి సబ్సులు, పర్ఫ్యూమ్‌లలో వినియోగిస్తారు. తలలో పేల నివారణలో వట్టివేరు అద్భుతంగా పనిచేస్తుంది. వట్టివేర్లతో తయారుచేసిన చాపలు కిటికీలు, ఇంటి గుమ్మాలకు వేలాడదీస్తే.. గది చల్లగా మారుతుంది. వట్టివేరు నుంచి తీసిన నూనెతో మర్దనా చేస్తే శరీర నొప్పులు తగ్గుతాయి.
ఖస్ ఖస్ అని పిలుచుకునే వట్టివేళ్ల గడ్డి ముందుగా పుట్టింది భారతదేశంలోనే అని ఎంతమందికి తెలుసు? వట్టివేళ్లు భూమిలో చాలా లోతుగా పెరుగుతాయి. అందువల్ల భూమి కోతను అరికడతాయి. భూసార పరిరక్షణలో వట్టివేళ్లు బాగా పనిచేస్తాయి. వట్టివేళ్లు లోతుగా భూమిలోకి వెళ్లడం వల్ల మొక్కలు నీటి ఎద్దడిని తట్టుకుంటాయి. వట్టివేళ్లు పెంచిన భూమిలో కలుపు మొక్కల బెడద ఉండదు. వట్టివేళ్ల గడ్డి వెదజల్లే సువాసన సమీపంలోని పంటల దరిదాపులకు క్రిమి కీటకాలను చేరనీయదు. వట్టివేళ్ల గడ్డి వల్ల వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ చాలా వరకు తగ్గుతుంది.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు వట్టివేళ్లు పెంచిన రైతులకు చక్కని ఆదాయం కూడా ఇస్తుంది. అగ్రి రూట్స్ బ్యాగుల్లో వట్టివేరు సాగు చేస్తున్న శ్రీకాళహస్తికి సమీపంలోని పీకేపల్లి యువరైతు రుద్రారెడ్డి అనుభవాలు తెలుసుకుందాం. తమిళనాడులోని అగ్రిరూట్స్ కంపెనీ బ్యాగులు, నాణ్యమైన వట్టివేరు మొక్కలు, వాటికి నెలనెలా అవసరమైన ఎరువులు సరఫరా చేస్తుంది. మొక్కలను మనకు అతి సమీపంలోకి పంపిస్తుంది. అగ్రిరూట్స్ సంస్థ తనకు మంచి నాణ్యమైన K 6 రకం వట్టివేర్ల మొక్కలు సరఫరా చేసిందని రుద్రారెడ్డి చెప్పారు. ఈ మొక్కలకు వేర్లు చాలా పొడవుగా, చిక్కగా వస్తాయి. ఒక్కో బ్యాగ్ నుంచి 4 నుంచి 5 కిలోల వరకు దిగుబడి ఇస్తుందన్నారు.
వ్యవసాయంలో ఎన్నో ప్రయోగాలు చేసి, విఫలమైన రైతులకైనా వట్టివేర్ల సాగు లాభసాటిగా ఉంటుందని రుద్రారెడ్డి భావిస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి అగ్రిరూట్ సంస్థను తాను సంప్రదించినట్లు చెప్పారు. తన క్షేత్రంలో వట్టివేర్ల పంట బాగుండడంతో పది మంది రైతులకు చెప్పి వారి చేత కూడా సాగు చేయిస్తున్నట్లు తెలిపారు. ఐదెకరాల్లో సాంప్రదాయ పంటల పండిస్తే వచ్చేంత ఆదాయం కేవలం 10 సెంట్లలో వెయ్యి బ్యాగుల్లో వట్టివేర్ల సాగు చేస్తే వస్తుందన్నారు.
అగ్రిరూట్స్ సంస్థ ముందుగా తనకు 500 బ్యాగులు, ఎరువు పంపించినట్లు రుద్రారెడ్డి వెల్లడించారు. అవి అందిన తర్వాత బ్యాగులను సిద్ధం చేయడానికి వారం రోజులు పట్టిందని చెప్పారు. 500 బ్యాగుల్లో నింపేందుకు 7 ట్రాక్టర్ల మట్టి అవసరమైందన్నారు. దాంతో పాటు ఒక ట్రాక్టర్ పశువుల ఎరువు వాడినట్లు తెలిపారు. బ్యాగుల్లో ఒక లేయర్ ఎర్రమట్టి, మరో లేయర్‌లో పశువుల ఎరువు, ఇంకో లేయర్‌లో కంపెనీ పంపిన ఎరువులు ఇలా లేయర్లుగా బ్యాగుల్లో నింపినట్లు వెల్లడించారు. ఆ బ్యాగుల్లో నీళ్లు పట్టి, రెడీ అయిన తర్వాత అర అడుగు ఎదిగిన మొక్కలను మన సమీపానికే పంపిస్తారని చెప్పారు. మొక్కలతో పాటు ఆర్గానిక్ మందు కూడా ఇస్తారన్నారు. ఆ మందు కూడా బ్యాగుల్లో వేసి, ఒక రోజు తర్వాత మొక్కలను వాటిలో నాటుకోవాలని చెప్పారు.
మొక్కలు నాటిన తర్వాత వర్షాలు కురవకపోతే.. బ్యాగుల్లో రోజుకు రెండుసార్లు నీరు పోసుకోవాలి. మొక్క బతికిన తర్వాత 20 రోజుల నుంచి రోజుకు ఒకసారి నీరు అందిస్తే సరిపోతుంది. నెల రోజుల తర్వాత రెండు రోజులకు ఒకసారి నీరు ఇస్తే చాలు. మూడో నెల తర్వాత మూడు రోజులకోసారి నీరు ఇవ్వాలి. మొక్క పెరిగే కొద్దీ నీటి సరఫరా తగ్గించాలి. వట్టివేర్ల మొక్క పైభాగంలో అర అడుగు ఎత్తు విడిచిపెట్టి మూడు నెలలకు ఒకసారి కత్తిరించాలి. ఇలా సాగు సమయం మొత్తంలో మూడుసార్లు కత్తిరిస్తేనే వేరు బ్యాగు లోపల బాగా కిందికి చొచ్చుకు వెళ్తుంది.
వట్టివేర్ల సాగును బ్యాగుల్లోనే కాదు.. భూమిలో కూడా చేయవచ్చు. అయితే.. భూమిలో మట్టి గుల్లగా ఉన్నంత వరకు మాత్రమే వేర్లు విస్తరిస్తాయి. బ్యాగుల్లో అయితే.. మనం నింపిన మట్టి గుల్లగా ఉంటుంది కాబట్టి బ్యాగు మొత్తం వేర్లు పొడవుగా, గుబురుగా విస్తరిస్తాయని రుద్రారెడ్డి వివరించారు. భూమిలో సాగుచేస్తే కేవలం అర కిలో, ముప్పావు కిలో వరకే దిగుబడి ఉంటుంది. బ్యాగుల్లో నింపిన లూజ్ మట్టిలో 5 కిలోల వరకు దిగుబడి రావచ్చని చెప్పారు. సంచుల్లో ఎర్రమట్టి నింపితే వట్టివేరు నెంబర్ వన్ క్వాలిటీగా వస్తుందన్నారు.
వట్టివేర్ల సాగు 10 నెలల పంట. 11వ నెల మధ్యలో వట్టివేర్లు కట్ చేసుకోవాలని రుద్రారెడ్డి చెప్పారు. తొలిసారి వట్టివేర్ల ఒక మొక్క ఒక బ్యాగులో నాటుకుంటాం. వేర్లు కోసిన తర్వాత అదే బ్యాగులో 20 మొక్కలు తయారవుతాయి. వట్టివేర్లు కట్ చేసిన తర్వాత ఆ మొక్కలను తదుపరి పంట కోసం వేరే బ్యాగుల్లో నాటుకోవచ్చు. తొలిసారి వట్టివేర్లు కట్ చేసేందుకు కత్తిరించిన అదే బ్యాగు రెండో సారికి కూడా పనికి వస్తుంది.
ఒక్కో బ్యాగులో ఒక్కో వట్టివేర్ల మొక్క నాటేందుకు మొక్క, రవాణా, మట్టి, పశువుల ఎరువు, ఫెర్టిలైజర్ అన్నీ కలిపి రూ.95 ఖర్చు అవుతుందని రైతు రుద్రారెడ్డి వెల్లడించారు. అలా తాను 500 మొక్కలు నాటేందుకు రూ.47,500 కంపెనీకి కట్టినట్లు చెప్పారు. ఇది కాకుండా బ్యాగులు నింపే మట్టి, పశువుల ఎరువుల ఖర్చు ఉంటుంది. దాంతో పాటు 500 బ్యాగులను నింపేందుకు అవసరమయ్యే నలుగురు మనుషుల కూలీ ఖర్చు ఉంటుంది. వెయ్యి బ్యాగుల్లో వట్టివేర్లు సాగు కోసం మొక్కలు, ఎరువులు, బ్యాగులు సహా అవసరమైనవి సరఫరా చేసిన కంపెనీకి రూ.95 వేలు, మట్టి, పశువుల ఎరువు కొనేందుకు, బ్యాగుల్లో నింపేందుకు అన్ని ఖర్చులూ కలిపి లక్షా 50 వేలు అవుతుందన్నారు రుద్రారెడ్డి. ఇలా ఒక బ్యాగ్‌కు రూ.150 ఖర్చవుతుంది. ఒక్కో బ్యాగు నుంచి తక్కువలో తక్కువ 3 కిలోలే దిగుబడి వచ్చినా.. కిలోకి రూ.150 రూపాయలే ధర వచ్చినా రూ.300 నికరంగా మిగులుతుందని చెప్పారు.
అగ్రిరూట్స్ సంస్థ ప్రతినిధులు నెల నెలా క్షేత్రానికి వచ్చి మొక్కలు ఎలా ఉన్నాయి? గ్రోత్ ఎలా ఉంది? ఎలాంటి మందులు అవసరమో నిర్ణయించి, వారే పంపిస్తారని చెప్పారు రుద్రారెడ్డి. వేరు కోత కోసిన తర్వాత నీటిలో శుభ్రం చేసి, నీరంతా ఆరిపోయిన తర్వాత కంపెనీకి చెబితే.. వచ్చి తీసుకువెళ్తారని అన్నారు. మూడు టన్నుల వట్టివేర్ల ఖరీదును అప్పటికప్పుడే చెల్లించి పట్టుకెళతారని తెలిపారు. ఒక కిలో వట్టివేరు కొనుగోలుకు మొక్క వేసినప్పుడే కంపెనీ రూ.150 నుంచి 200కు అగ్రిమెంట్ చేస్తుంది. మొక్కలు, ఎరువులు సరఫరా చేయడంతో పాటు వేర్లను వాటి నాణ్యత, సైజును బట్టి రేటు నిర్ణయించి కంపెనీ కొంటుంది. రైతుకు ఎలాంటి సహాయం అవసరమైనా చాలా వేగంగా స్పందిస్తుందని రుద్రారెడ్డి తెలిపారు. ఔత్సాహిక రైతులు ఎంత చిన్న స్థలంలో అయినా లేదా టెర్రస్ పైన కూడా బ్యాగుల్లో వట్టివేర్ల సాగుచేసి, మంది ఆదాయం సాధించవచ్చని రుద్రారెడ్డి చెప్పారు.
అగ్రిరూట్ కంపెనీ నుంచి ఇతర వివరాల కోసం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యన 9398424805/ 8688189524/ 8341817154 నెంబర్లలో సంప్రదించవచ్చు.





















