100వ కిసాన్ రైలు ప్రారంభం

దేశంలో 100వ కిసాన్ రైలు పట్టాలెక్కింది. మ‌హారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని శాలిమార్‌కు న‌డిచే ఈ కిసాన్ రైలును 2020 డిసెంబర్ 28న వీడియో కాన్ఫరెన్సు ద్వారా పచ్చ జెండా ఊపి ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర మంత్రులు న‌రేంద్ర సింహ్ తోమ‌ర్‌,...

‘తూర్పు’న నవోదయం

చారిత్రకంగా ఎంతో విశిష్టత కలిగిన తూర్పు గోదావరి జిల్లా ప్రకృతి వ్యవసాయంలో కూడా ముందంజ వేస్తోంది. ఈ జిల్లాలో ప్రస్తుతం వేలాదిగా రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యాన్ని అనుసరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుభాష్ పాలేకర్ ప్రకృతి సాగు విధానాన్ని ప్రోత్సహిస్తుండడంతో పలువురు రైతులు రసాయనాల వాడకం...

రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతులకు అందించే ఆర్థిక ప్రయోజనం తాలూకు తదుపరి విడతను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. 2020 డిసెంబర్ 25న రూ. 18,000 కోట్లను 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా...

ఆదర్శంగా నిలుస్తున్న హరిత

అది ప్రకాశం జిల్లా కొండెపి మండలంలోని అంకర్లపూడి గ్రామం. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువతి హరిత వ్యవసాయంవైపు సాగారు. జీవామృత విధానంలో సేద్యం చేస్తున్నారు. హరిత ఇప్పుడు పరిసర గ్రామాల్లో (ZBNF) ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా నిలిచారు. కూరగాయలతో పాటు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో ఆమె వరి...
video

సైకత కళాచిత్రంలో ప్రకృతి వ్యవసాయం

సైకత కళా చిత్తరువుల (శాండ్ ఆర్ట్) ద్వారా ప్రకృతి వ్యవసాయ విశిష్టతను చాటే వీడియో ఇది. దీన్ని వీక్షించి ప్రకృతి సాగును స్వాగతించండి మరి!

ఇది కృష్ణప్ప సాధించిన విజయం

పట్టుదల, నిబద్ధత, శ్రద్ధ, అభినివేశం.. కృష్ణప్ప దాసప్ప గౌడను విజేతగా నిలిపాయి. ప్రకృతి సేద్యంపై ఉన్న అచంచల విశ్వాసం ఆయనను ఇవాళ వార్తల్లో వ్యక్తిని చేసింది. శూన్యం అనుకున్నదాని నుండి ఆయన బంగారం పండించి చూపారు. మట్టిని నమ్మితే ఫలితం ఉండి తీరుతుందని మరోసారి నిరూపించారు. కృష్ణప్ప...

ప్రకృతి వ్యవసాయమే దేశానికి దిక్సూచి

భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానమైన ప్రకృతి సాగు విధానాన్ని తిరిగి వాడుకలోకి తీసుకురావాలనీ, అదే దేశ వ్యవసాయ భవిష్యత్తుకు దిక్సూచి అవుతుందనీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. 'జాతీయ రైతు దినోత్సవం' (కిసాన్ దివస్) సందర్భంగా 2020 డిసెంబర్ 23వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య...

గోచర భూముల అవసరం ఎందుకంటే…

గోచర భూములు అంటే గోవులు స్వేచ్ఛగా తిరుగుతూ గడ్డి తినడానికి ఉద్దేశించిన భూములు అని అర్థం. గోసంతతి అంటే అర్థం సంతానం మొత్తమని. అంటే ఆవులు, ఎద్దులు, ఆడ దూడలు, మగ దూడలని గ్రహించాలి. గోచర భూములన్నవి పూర్వం ప్రతి గ్రామంలోనూ ఉండేవి. అవి దేవాలయాల అధీనంలో...

ఏపీలో జోరుగా ప్రకృతి వ్యవసాయం

రసాయన రహిత వ్యవసాయం అన్నది ఇప్పుడు దేశాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఒక నినాదం. రసాయన ఎరువులు, కెమికల్ క్రిమిసంహారకాల వాడకం తగ్గించాలని పలువురు వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆ దిశగా దూసుకుపోతోంది. ఒకప్పుడు రసాయన క్రిమిసంహారక మందుల వాడకం అత్యధికంగా...

ప్రకృతి వ్యవసాయ వైతాళికుడు.. శ్రీ భాస్కర్ సావే 

మన దేశంలో వ్యవసాయం ఎందుకు నష్టదాయకంగా మారుతోంది? ఆరుగాలం శ్రమించే రైతన్నలు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? మనం అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానం ఎందుకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది? ఈ ప్రశ్నలన్నిటికీ భాస్కర్ హిరాజీ సావే గారు...

Latest news