ఏపీలో జోరుగా ప్రకృతి వ్యవసాయం
రసాయన రహిత వ్యవసాయం అన్నది ఇప్పుడు దేశాన్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఒక నినాదం. రసాయన ఎరువులు, కెమికల్ క్రిమిసంహారకాల వాడకం తగ్గించాలని పలువురు వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు ఆ దిశగా దూసుకుపోతోంది. ఒకప్పుడు రసాయన క్రిమిసంహారక మందుల వాడకం అత్యధికంగా...
ప్రకృతి వ్యవసాయ వైతాళికుడు.. శ్రీ భాస్కర్ సావే
మన దేశంలో వ్యవసాయం ఎందుకు నష్టదాయకంగా మారుతోంది? ఆరుగాలం శ్రమించే రైతన్నలు ఎందుకు అప్పుల పాలవుతున్నారు? దిక్కుతోచని స్థితిలో చిక్కుకుని అన్నదాతలు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు? మనం అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ విధానం ఎందుకు తలకు మించిన భారంగా పరిణమిస్తోంది?
ఈ ప్రశ్నలన్నిటికీ భాస్కర్ హిరాజీ సావే గారు...
మద్దతు ధరతోనే పంటల కొనుగోళ్లు
కొత్త సాగు చట్టాల తర్వాత మద్దతుధర కొనసాగింపుపై రైతాంగంలో పలు సందేహాలు తలెత్తాయి. భవిష్యత్తులో మద్దతు ధర ఉండదేమోనన్న భయాందోళనలతో పంజాబీ రైతులు ఢిల్లీని ముట్టడించారు. అయితే కనీస మద్దతు ధరను ఇక ముందు కూడా కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తోంది. అందుకు అనుగుణంగా...
కొత్త సాగు చట్టాలతో రైతుకే లాభం : మోదీ
రైతు ఎంతగా కష్టించి పని చేసినప్పటికీ ధాన్యానికి, కాయగూరలకు, పండ్లకు తగిన నిల్వ సదుపాయాలు లేకపోతే భారీ నష్టాల బారిన పడక తప్పదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను, శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధిపరచడానికి, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ వెంచర్‌లను ఏర్పాటు చేయడానికి వ్యాపార...
నేలతల్లికి ప్రణమిల్లి…
ప్రకృతి వ్యవసాయం రైతులనే కాకుండా విభిన్నవర్గాలవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి డాక్టర్ చెన్నమనేని పద్మ ఒక ఉదాహరణ. ఆమె హైదరాబాద్‌లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్. తను బోధించే సబ్జక్టు తెలుగు సాహిత్యం అయినప్పటికీ డాక్టర్ పద్మ అంతకంటే ఎక్కువగా ప్రకృతి...
రైతన్నల నేస్తం.. శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు
ప్రకృతి సేద్యం చేసే తెలుగు రాష్ట్రాల రైతాంగానికి శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావును గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గత పదిహేనేళ్లుగా వెంకటేశ్వర రావుగారు ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి, విస్తృతికి కృషి చేస్తున్నారు. ఆయన విశిష్ట కృషికి గుర్తింపుగా ఆయనను 2019లో పద్మశ్రీ పురస్కారం కూడా...
చెరకు రైతులకు సబ్సిడీ
దేశంలోని చెరకు రైతులకు రూ.3,500 కోట్ల మేరకు సబ్సిడీ అందించేందుకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక ట్వీట్‌లో ఈ విషయం వెల్లడించారు. ఐదు కోట్ల చెరకు రైతులు, వారి కుటుంబాలకు, సంబంధిత రంగాలకు చెందిన కార్మికులకు ఈ నిర్ణయం...
అమ్మ తర్వాత గొప్ప మనసు అన్నదాతదే!
అన్నదాతల ప్రగతిలోనే దేశాభివృద్ధి దాగి ఉందని, "స్వర్ణభారత్ ట్రస్ట్" స్థాపన వెనుక ఉన్న కారణాల్లో రైతుల ఆర్థికాభివృద్ధికి దన్నుగా నిలవడం కూడా ఒకటని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. రైతుల కష్టం కేవలం వారి కోసం మాత్రమే కాదనీ, అది లోకానికి అన్నం పెట్టడానికనీ...
సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచి
రసాయన ఎరువులు, పురుగు మందుల దుష్ప్రభావానికి గురై నానా అవస్థలూ పడిన ఆ ఊరు ఆ తర్వాత దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. సంప్రదాయ వ్యవసాయానికి దిక్సూచిగా మారింది. ఆ ఊరు పేరు ఏనబావి. వరంగల్ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని ఈ ఊరు రసాయన రహిత గ్రామం...
ప్రకృతి వ్యవసాయంలో ఒక విజయగాథ
మట్టిని నమ్ముకున్నవారికి నేలతల్లే తోవ చూపిస్తుంది. ప్రకృతిమాత కరుణ రైతన్నలకు ఎప్పటికైనా తప్పక సిరుల వర్షం కురిపిస్తుంది. వెంకట్ వట్టి విజయగాథ దీనికి ఒక ఉదాహరణ. హైదరాబాద్‌కు చెందిన ఆయన మొదట్లో ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఆ తర్వాత ఐటీ రంగానికి మారారు. సుమారు పదహారేళ్లు విదేశాల్లో...


































