కుటుంబాన్నే ఆర్గానిక్ ఫ్యామిలీ చేసిన ‘ఆమె’
నమ్మకం, సంరక్షణ గృహిణి భువనేశ్వరిలో ఉన్న అతి గొప్ప బలాలు. ఆ బలాలతోనే ఆమె తన అత్తింటివారిని సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించగలిగింది. అయితే.. భువనేశ్వరి కుటుంబానికి తొలుత ఆర్గానిక్ వ్యవసాయంలో ఓనమాలు కూడా తెలియవు. అత్తింటి వారికి ఉన్న 10 ఎకరాల్లో నిరుపయోగంగా ఉన్న ఒకటిన్నర...
తాత చెప్పిన మాట.. మనవడి ప్రకృతి బాట
చాలా ఏళ్ల క్రితం ఓ తాత.. అతని మనవడు తమ పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. రసాయనాలతో పొలంలో బాగా ఎదిగిన పైరును చూసి మనవడు ఎంతో సంబరపడుతున్నాడు. మనవడి ముఖంలో సంతోషాన్ని గమనించాడు ఆ తాత.. సేద్యం చేయడంలో దశాబ్దాలుగా డక్కీ మక్కీలు తిన్న అనుభవం...
మిలియనీర్‌ను చేసిన ఆర్గానిక్ జామ
ఎంబీఏ చదివాడు. రాయ్‌పూర్‌లో ఓ సీడ్స్ సంస్థలో ఉద్యోగం చేశాడు. అతనిది వ్యవసాయ కుటుంబం కూడా కాదు. అయినా.. ఆర్గానిక్ విధానంలో థాయ్ రకం జామ పంటలు పండించి, లక్షలకు లక్షలు లాభాలు ఆర్జిస్తున్నాడు. ఒక్కో ఎకరానికి ఖర్చులు పోగా ఏడాదికి కనీసం 6 లక్షల రూపాయల...
ఆర్గానిక్ అంజీరతో అధికాదాయం
ధైర్యంగా ముందడుగేశాడు ఆ యువరైతు.. ఔషధ గుణాలు అధికంగా ఉండే అంజీర సాగుచేయడం ప్రారంభించాడు. అందులోనూ ఆర్గానిక్ సాగు పద్ధతిలో అంజీర పంటలు పండిస్తున్నాడు. ఆ ఊరిలో ఇతర రైతులు ఎవరికీ అందనంత ఆదాయం సంపాదిస్తున్నాడు. అతడే కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ల శ్రీనివాస్. రామగుండం మండలంలోని...
ఊరూరా ప్రకృతి వ్యవసాయం
ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక్క గ్రామం అయినా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పంటల సాగు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేచురల్ ఫార్మింగ్‌లో ‘గోధన్’ లేదా ఆవు పేడ, గోమూత్రంతో తయారుచేసే జీవామృతం, ఘన జీవామృతాలను వినియోగించాలని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆయన సూచించారు....
మోదీ మెచ్చిన మన మహిళా రైతు
వన్నూరమ్మ.. ఒంటరి దళిత మహిళ.. ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. ఆపై దేశ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న మన అనంతపురం జిల్లా మహిళా రైతు. పీఎం కిసాన్ నిధుల పంపిణీ ద్వారా ఆర్థిక సాయం కోసం ఎంపికైన ఆరుగురు లబ్ధిదారుల్లో వన్నూరమ్మ ఒకరు. ఆ నిధుల...
‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ అవార్డు గ్రహీతలు
‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా వ్యవసాయంలో విశేషంగా కృషి చేసిన పలువురు రైతులకు ‘సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్’ అవార్డులు అందజేసి సత్కరించింది. తెలంగాణలోని 15 మంది ఆదర్శ రైతులకు ఫౌండేషన్ తరఫున సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, వీఈఆర్ ఆగ్రోఫామ్స్ అధినేత, సీనియర్ జర్నలిస్టు ...
ప్రతి రైతుకి చిరంజీవి సెల్యూట్
అతివృష్టి, అనావృష్టి ఇలాంటి అనేక కష్టనష్టాలను తట్టుకుని అహర్నిశలు అన్నదాత కష్టపడితే తప్ప మన కంచంలోకి అన్నం మెతుకు రాదు. ఆరుగాలం రైతు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంట పండిస్తేనే మన నోటికి అన్నంముద్ద దొరుకుతుంది. అందుకే రైతు లేనిదే ప్రపంచం లేదు.. రైతే దేశానికి వెన్నుముక...
అన్నదాతకు అందరూ సామంతులే!
ఆరుగాలం కష్టపడి మన ఆకలి తీరుస్తున్న రైతన్నకు ప్రతి ఒక్కరూ సామంతులే అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుల వరకు అందరూ అన్నదాతకు సామంతరాజులే అని అభివర్ణించారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో గురువారం జరిగిన ‘జాతీయ రైతు దినోత్సవం’...
మహిళా రైతులూ మీకు జోహార్లు
అనావృష్టికి, కరువుకు, వలసలకు అనంతపురం జిల్లా పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఏర్పడుతున్న కరువు కాటకాలు వారి జీవితాల్లో నిరాశా నిస్పృహలు నింపేశాయి. అక్కడ సరిపడినన్ని వర్షాలు ఉండవు. అప్పుడప్పుడూ కురిసే వర్షంతో భూమిలో చేరిన కొద్దిపాటి నీటిస్థాయిలు కూడా వేగంగా తగ్గిపోతుంటాయి. రసాయన ఎరువులతో సాగుచేసి, తమ...


































